హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు వరుసల రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొలిదశలో ప్యాకేజీ–1 కింద 11 కి.మీ దూరం గల రోడ్డు నిర్మాణ పనుల కోసం రూ.86 కోట్లు రిలీజ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హన్మకొండ జిల్లాలోని ఖాజీపేటలో రైల్వే వ్యాగన్పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం బ్యాలెన్స్ గా ఉన్న రూ.17 కోట్లను సైతం సర్కారు రిలీజ్చేసింది.
వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాల రిపేర్లు, మెయింటెనెన్స్వర్కుల కోసం రూ.50 లక్షలు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఆకులవారి ఘనపురంలో ప్రభుత్వ భవనాల రిపేర్ల కోసం రూ.9.90 లక్షలు రిలీజ్చేస్తూ ఆర్అండ్బీ డిపార్ట్ మెంట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
