రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

యాదాద్రి, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు యాదాద్రి  కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో రోడ్డుభద్రత, ప్రమాదాల నివారణపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ.. 

రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను(బ్లాక్ స్పాట్లు) గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు.

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి 

యాదాద్రి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి అధికారులు, పోలీసులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌‌లో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి తదితర సంబంధిత విభాగాలతో కలిసి డ్రగ్స్ నిర్మూలనపై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని కాలేజీల్లో, స్కూళ్లలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.   జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు.