ఇన్స్టాగ్రామ్ కోసం కొత్త టీవీ యాప్‌ను కూడా టెస్ట్ చేస్తోంది మెటా కంపెనీ. దీన్ని స్పెషల్‌గా రీల్స్ చూసేందుకు డిజైన్ చేశారు. ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా మొదట అమెరికాలోని అమెజాన్ ఫైర్ టీవీ డివైజ్‌లలో టెస్ట్ చేస్తున్నారు. దీంతో యాప్ హోమ్ స్క్రీన్ మొబైల్ ఇంటర్ఫేస్ డిఫరెంట్‌గా కనిపించబోతోంది. వ్యూయర్స్‌కు వీడియో కలెక్షన్లు అడ్డంగా కనిపిస్తాయి. బ్రౌజ్ చేయడానికి రిమోట్ వాడొచ్చు.
థంబ్‌నెయిల్‌పై క్లిక్ చేసిన తర్వాత రీల్స్ పూర్తి పోట్రెయిట్మోడ్లో ప్లే అవుతాయి. స్క్రీన్‌కి ఒక వైపు టైటిల్ ఉంటుంది. మరొకవైపు లైక్స్, షేర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ టీవీ యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత చానెల్స్ అని కొత్త సెక్షన్ కనిపిస్తుంది. చానెల్లోని రీల్స్ టాపిక్, థీమ్, ట్రెండ్ బేస్డ్గా డివైడ్ చేసి ఉంటాయి. దీంతో ఆటలు, వంట, మ్యూజిక్.. ఇలా ఏదైనా ట్రెండింగ్లోఉన్న కంటెంట్‌ను చూడడం ఈజీ అవుతుంది. టీవీ యాప్‌లో కూడా సెర్చ్ ఫీడ్ ఉంటుంది. అంతేకాదు.. యాప్‌లో ఒకేసారి ఐదు అకౌంట్ల వరకు లాగిన్ అవ్వొచ్చు.
►ALSO READ | ఇన్ స్టా రీల్స్ కోసం.. నయా ఫీచర్స్
ఫొటోలు, సెల్ఫీల ట్రెండ్ మెల్లగా పోతోంది. ఎక్కడికెళ్లినా ఎవరిని చూసినా ‘ఒక రీల్ చేద్దామా?’ అని అడుగుతున్నారు. ఇప్పుడు గ్యాలరీ కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అంతకంటే ఎక్కువమంది ఆ రీల్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే మెటా కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన ఇన్స్టాగ్రామ్ యాప్ యూజర్ల కోసం మెరుగైన ఫీచర్లను అందిస్తోంది. ఇప్పుడు మరో రెండు ఫీచర్లను తీసుకురావడానికి టెస్టింగ్ చేస్తోంది.
