ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కేవలం 187 హోంగార్డు ఉద్యోగాల కోసం ఏకంగా 8వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇంతమందికి ఒకేసారి పరీక్ష పెట్టడానికి సాధారణ హాళ్లు సరిపోకపోవడంతో అధికారులు ఏకంగా జమదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్ అంటే విమానాలు దిగే రన్‌వే పై పరీక్ష నిర్వహించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఉద్యోగానికి కనీస అర్హత కేవలం 5వ తరగతి మాత్రమే. కానీ పరీక్షకు వచ్చిన వారిలో డిగ్రీ, పీజీ, అలాగే టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సులు చేసిన వాళ్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.
డిసెంబర్ 16న జరిగిన ఈ రాత పరీక్షని 50 మార్కులకు నిర్వహించారు. దీనికోసం అభ్యర్థులకు 90 నిమిషాల సమయం ఇవ్వగా.. ఎక్కడా కాపీయింగ్, చీటింగ్ జరగకుండా అధికారులు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. ఈ రాత పరీక్షలో పాస్ అయిన వారికి తర్వాత శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
►ALSO READ | దీపూను అల్లరిమూకకు పోలీసులే అప్పగించారు:తస్లీమా నస్రీన్
ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ నియామకం అయినా కూడా... ఇంత మంది పరీక్షకు అప్లయ్ చేసుకోవడం అది కూడా అందరు డిగ్రీ, పిజిలు చేసినవాళ్ళే ఉండటం దేశంలో నిరుద్యోగం ఎంత ఉందొ తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా లభించే సామాజిక భద్రత కారణంగానే నిరుద్యోగ యువత ఇలాంటి పోస్టులకు అప్లయ్ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఉద్యోగాలకు సెలెక్టయిన వారికి రోజుకు రూ. 639 జీతం ఇస్తారు. సాధారణంగా ఇలాంటి పరీక్షలను స్టేడియాల్లో లేదా పెద్ద గ్రౌండ్లలో నిర్వహిస్తారు. కానీ జనం ఇంత భారీగా రావడంతో అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా రన్‌వేనే పరీక్షా కేంద్రంగా మార్చేశామని పోలీసులు తెలిపారు.
