దక్షిణాఫ్రికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. జోహన్నెస్‌బర్గ్ పట్టణ శివార్లలోని ఓ టౌన్‌షిప్‌లోని బార్ లో గుర్తుతెలియని దుండగులు ఆదివారం (డిసెంబర్ 21) విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు బార్ లో కనిపించిన వారిని కనిపించినట్లు షూట్ చేశారు. దక్షిణాఫ్రికాలో ఇలాంటి సామూహిక మారణకాండ జరగడం ఈ నెలలోనే ఇది రెండోసారి.
ఆదివారం తెల్లవారుజామున జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని బెకర్స్ డాల్ బార్ పై దాదాపు 12మంది వ్యక్తులు దాడి చేశారు. రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు.
డిసెంబర్ 6న కూడా రాజధాని ప్రిటోరియా సమీపంలోని సౌల్స్‌విల్లే టౌన్‌షిప్‌లోని హాస్టల్‌పై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో మూడేళ్ల చిన్నారితో సహా డజను మందిని చనిపోయారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న ప్రదేశంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.
►ALSO READ | సిరియాలో బాంబుల వర్షం..ఐఎస్ క్యాంపులే టార్గెట్ గా అమెరికా దాడులు
దక్షిణాఫ్రికాలో వ్యక్తిగత రక్షణకోసం ప్రజలు లైసెన్స్ పొందిన గన్స్ కలిగి ఉంటారు. సాధారణంగా అక్కడ కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అక్రమంగా గన్స్ కలిగి ఉన్నవారే ఎక్కువ అని అక్కడి పోలీస్ డేటా చెబుతోంది. 2025లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రతి రోజులు 63 మంది మృతిచెందారని డేటా చెబుతోంది. దోపిడీ,ముఠా హింస కూడా మరణాలకు ఓ కారణమని పోలీస్ డేటా చెబుతోంది.
