- చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కీమ్ లు క్షేత్ర స్థాయి లబ్ధిదారుల వరకు చేరాలని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ( సీసీఎఫ్ ) క్షితిజ అన్నారు. సంక్షేమ శాఖలో పనిచేయాలని ప్రతి సివిల్ సర్వీస్ అధికారి భావిస్తారని, నిత్యం ప్రజలతో ఎక్కువ కనెక్ట్ అయ్యే శాఖ వెల్ఫేర్ అని ఆమె తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ పోస్ట్ నుంచి రిలీవ్ అయిన సందర్భంగా శనివారం మసాబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవన్లో అన్ని డిపార్ట్ మెంట్ల ఎస్సీ అధికారులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఇటీవల క్షితిజను మాతృశాఖ ఫారెస్ట్ కు ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ సందర్భంగా క్షితిజ మాట్లాడుతూ.. ఎస్సీడీడీ శాఖకు తాను కొత్త అయినప్పటికీ కార్యాలయ సిబ్బంది, జిల్లా అధికారులు ఫీల్డ్ నుంచి అందించిన సహకారం మరువలేనిదని క్షితిజ అన్నారు. లబ్ధిదారులందరికి ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతోనే తాను పనిచేశానని చెప్పారు. ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ గా విజయవంతంగా పనిచేశారని అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు.
