ముషీరాబాద్, వెలుగు: ప్రజా బాటలో భాగంగా విద్యుత్ అధికారులు శనివారం రామ్ నగర్ గుండు, లలిత నగర్, బౌద్ధ నగర్లో బస్తీలో పర్యటించారు. బర్కత్పుర ఏడీఈ ధనుంజయ నేతృత్వంలో విద్యానగర్ ఏఈ, సిబ్బంది ప్రజలను కలిసి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే వేసవికి అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు క్షేత్రస్థాయిలో మరమ్మతులు చేపడుతున్నామన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చెత్త తొలగిస్తున్నామని, ఎల్టీ లైన్లు, కండక్టర్ కేబుల్స్ పరిశీలించి కొత్తవి వేస్తున్నామని, చెట్ల కొమ్మలు తొలగిస్తున్నామని తెలిపారు. ఒకే చోట రెండు మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే అధిక కెపాసిటీ ఒక్కటే ఏర్పాటు చేస్తున్నామని, పనిచేయని ఏబీ స్విచులు మారుస్తున్నామన్నారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారమని సూచించారు.
