అంబేద్కర్ కాలేజీ ఆధ్వర్యంలో కనక మామిడిలో ఎన్ఎస్ఎస్ క్యాంప్

అంబేద్కర్ కాలేజీ ఆధ్వర్యంలో కనక మామిడిలో ఎన్ఎస్ఎస్ క్యాంప్

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో  బాగ్​లింగంపల్లి డా.బి.ఆర్. అంబేద్కర్ కాలేజీ ఆధ్వర్యంలో ఎన్‌‌ఎస్‌‌ఎస్ శిబిరం ఏర్పాటు చేశారు. 7 రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామ రోడ్ల వెంట ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

మేనేజ్​మెంట్ కరస్పాండెంట్ డా. సరోజ వివేకానంద్, ప్రిన్సిపల్ డా. మట్టా శేఖర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా.బి.శ్రీధర్, ఎన్.కుమారస్వామి, ఎం.శ్రేణిక్ మార్గదర్శకత్వంలో యూనిట్-1, 2 విద్యార్థులు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రోడ్లు, పలు ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు. జీపీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి వాలంటీర్లకు సహకారాన్ని అభినందించారు.