భారత సముద్ర జలాల్లో మాదక ద్రవ్యాలు సీజ్.. విలువ వేల కోట్లు..  ఇరాక్ టూ ఆస్ట్రేలియా రవాణా

భారత సముద్ర జలాల్లో మాదక ద్రవ్యాలు సీజ్.. విలువ వేల కోట్లు..  ఇరాక్ టూ ఆస్ట్రేలియా రవాణా

భారతదేశ సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణా గుట్టురట్టు చేశారు అధికారులు. అక్రమంగా రవాణా అవుతున్న 2,500కిలోల హై ప్యూరిటీ మెతామ్ఫిటమైన్ను పట్టకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 12వేల కోట్ల రూపాయలుంటుందని అంచనా. డ్రగ్స్ లో మెత్ గా ఈ మాదకద్రవ్యాన్ని పిలుస్తారు. అరేబియన్‌ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సముద్ర తీరం వెంబడి డ్రగ్స్‌ రవాణా జరుగుతుందని 15 రోజుల క్రితమే విశ్వసనీయ సమాచారం అందింది.

 కేరళ, జమ్మూకాశ్మీర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత


కేరళ, జమ్మూకశ్మీర్ లలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కేరళ తీరంలోని అరేబియా సముద్రంలో ఇండియన్ ఆర్మీ, ఎన్ సీబీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో డ్రగ్స్ ను పట్టుకున్నారు. భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2,500 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఎలా దొరికారంటే..

మ్యాకమ్ తీరం నుంచి 134 బస్తాల్లో మెథామ్ సేతుమిన్నుకు మోసుకెళ్తున్న మథర్ షిప్ కదికలపై నేవీ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి డ్రగ్స్ తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మాక్రం తీరం వెంబడి పాక్, ఇరాన్ మీదుగా చిన్న పడవల్లోకి డ్రగ్స్ను పంపిణీ చేసుకుంటూ వస్తోందని సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు గాలింపు చేపట్టారు. ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి.

ఇరాక్‌  టూ  ఆస్ట్రేలియా

సముద్ర తీరం వెంబడి డ్రగ్స్‌ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఈ మేరకు నార్కోటిక్స్‌ నియంత్రణ విభాగం (NCB), భారత నేవీ  సంయుక్తంగా జరిపిన  దాడిలో అరేబియన్‌  సముద్రంలో ఇరాక్‌  నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా నౌకలో రవాణా అవుతున్న హెరాయిన్‌ను పట్టుకున్నారు.

జాయింట్‌ ఆపరేషన్‌

ఈ డ్రగ్స్ పట్టివేత కోసం అధికారులు ఆపరేషన్ సముద్ర గుప్త  నిర్వహించారు. శ్రీలంక, మాల్దీవుల సమాచారంతో ఇండియన్ నేవీ,  ఎన్సీఆర్బీ జాయింట్ ఆపరేషన్  చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు NCRB గుర్తించింది. ఇంతకుముందెప్పుడూ ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేదని ఎన్సీబీ అధికారులు తెలిపారు. సముద్ర జలాల్లోనే డ్రగ్స్ పట్టివేత.. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాల్లో శనివారం( మే13)న నలుగురు స్మగ్లర్ల నుంచి పోలీసులు భారీగా నగదు, హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు వివిధ రాష్ట్రాల్లో హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.