ఉస్మానియా ఆస్పత్రికి వెంటనే వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలి

V6 Velugu Posted on Jun 21, 2021

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రికి సాధ్యమైనంత త్వరగా కొత్త బిల్డింగ్ కట్టాలని డిమాండ్ చేశారు MIM MP అసదుద్దీన్ ఓవైసీ. పార్టీ MLAలతో కలిసి ఆయన ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్లు మంచిసేవలు అందిస్తున్నా.. హాస్పిటల్స్ లో సరైన సౌకర్యాలు లేవన్నారు అసద్. కొత్త బిల్డింగ్ ను అత్యవసరంగా కట్టించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ బిల్డింగ్ మూసేయడంతో పేషెంట్లకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కొత్త బిల్డింగ్ కోసం వెంటనే వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలన్నారు MIM లీడర్లు. మిషన్ భగీరథకోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ప్రజల ప్రాణాల కోసం ఎందుకు ఖర్చు చేయట్లేదని ప్రశ్నించారు. 

Tagged TRS, Hyderabad, FUNDS, CM KCR, MIM, osmania hospital, MP Asaduddin Owaisi,

Latest Videos

Subscribe Now

More News