
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీలో 2025– 26 విద్యా సంవత్సరానికి సివిల్స్, ఇతర పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ను ఓయూ వెబ్సైట్లో పొందుపరిచామని, ఆసక్తి ఉన్న యూనివర్సిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ తెలిపారు.
అప్లికేషన్లో పేర్కొన్న పత్రాలను జత చేసి అకాడమీలో జూన్ 30 లోపు అందజేయాలని సూచించారు. విద్యార్థుల రెగ్యులర్ క్లాసులకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం రెండు గంటల నుంచి 8 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు సివిల్స్ అకాడమీని సంప్రదించవచ్చన్నారు.