ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉంది : ఎంపీ అర్వింద్

 ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉంది : ఎంపీ అర్వింద్

ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మోదీ కాశ్మీర్ ను భారత్ లో కలిపేశారని చెప్పారు. రేపోమాపో పాకిస్థాన్ ను కూడా మనతో కలిసిపోతుంది కలపవచ్చని జోస్యం చెప్పారు. కోరుట్ల పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించడానికి కమిటీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సలహా అడిగితే సరిపోయేదని అన్నారు.

 రైతుల సమస్యలు అనేకమున్నాయని అర్వింద్ చెచెప్పారు. సంవత్సరానికి కొద్దిగా కొద్దిగా రేట్ పెరిగి పసుపు ధర ఇప్పుడు రూ. 14 వేలు అయ్యిందని అన్నారు. పసుపు రైతు మళ్ళీ పునర్వైభవం చూస్తున్నాడని దానికి కారణం నరేంద్ర మోదీనే అని అన్నారు. 60 వేల హెక్టార్ల పసుపు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. 

పసుపు విస్తీర్ణత తెలంగాణలో తగ్గి, దేశవ్యాప్తంగా పెరిగిందని తెలిపారు. లేబర్ కాస్ట్ రాష్ట్రంలో ఎక్కువగా ఉందని అన్నారు. మోదీని గెలిపించడం కనీస ధర్మమని అన్నారు. జగిత్యాల జిల్లాలో ఫిబ్రవరి 25, 26 తేదీలలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.