మేనమామ కూతురితో పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ వివాహం

మేనమామ కూతురితో పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ వివాహం

మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. ఇటు క్రికెటర్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తో పాటు..పాకిస్తాన్ క్రికెటర్లు -షాన్ మసూద్, షాదాబ్ ఖాన్,  హరీస్ రౌఫ్ లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా పెళ్లి చేసుకున్నాడు. 

పాకిస్తాన్ పేసర్ షాహీన్  షా ఆఫ్రిదీ తన మేనమామ,  పాక్ మాజీ ఆల్ రౌండర్  షాహీద్ ఆఫ్రిదీ  కూతురు అన్షాను వివాహం చేసుకున్నాడు. మ‌త పెద్దల స‌మ‌క్షంలో కరాచీలో నిఖా ఘనంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కు పాకిస్థాన్ కెప్టెన్‌ బాబార్ ఆజాం, ఆటగాళ్లు సర్ఫరాజ్ , అహ్మద్, న‌సీం షా, షాదాబ్ ఖాన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ప్రస్తుతం  షాహీన్, అన్షా పెళ్లి వీడియో, ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

22 ఏండ్ల షాహీన్ ఆఫ్రిదీ ఇప్పటి వరకు  25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు.  టెస్టులలో 99 వికెట్లు, వన్డేల్లో 62 వికెట్లు, టీ20ల్లో 58 వికెట్లు దక్కించుకున్నాడు. పాక్ జ‌ట్టులో కీల‌క బౌల‌ర్ అయిన షాహీన్ ఆఫ్రిదీ మోకాలి గాయం నుంచి కోలుకున్నాడు.