
మిర్పూర్: బ్యాటింగ్‌లో రాణించిన పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మూడో టీ20లో 74 రన్స్ తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బంగ్లా 2–1తో సిరీస్ గెలవగా... పాక్ ఊరట దక్కిచుకుంది. తొలుత పాక్ 20 ఓవర్లలో 178/7 స్కోరు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (63), హసన్ నవాజ్ (33), మహ్మద్ నవాజ్ (27), సైమ్ అయూబ్ (21) రాణించారు.
టస్కిన్ అహ్మద్ 3, నసుమ్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ 16.4 ఓవర్లలో 104 రన్స్‌కే ఆలౌటైంది. సైఫుద్దీన్ (35 నాటౌట్) టాప్ స్కోరర్. నసుమ్ అహ్మద్ (13), నబీ (10)తో పాటు మిగతా వారు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సల్మాన్ మీర్జా 3, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫర్హాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, జాకర్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.