V6 News

సికింద్రాబాద్లో అండర్ 14 సెలక్షన్స్.. ఉదయం నుంచి ఎండలోనే క్రీడాకారులు.. HCA తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం..

సికింద్రాబాద్లో అండర్ 14 సెలక్షన్స్.. ఉదయం నుంచి ఎండలోనే క్రీడాకారులు.. HCA తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం..

హైదరాబాద్ సికింద్రాబాద్ లో అండర్ 14 సెలక్షన్స్ జరుగుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 09) జరుగుతున్న సెలక్షన్స్ కోసం జింఖానా మైదానం వద్ద బారులు తీరారు క్రికెట్ క్రీడాకారులు. సెలక్షన్స్ ప్రాసెస్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  (HCA) తీరుపై క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గురవుతున్నారు.

క్రీడాకారులను ఉదయం నుంచి ఎండలో నిల్చోబెట్టి చోద్యం చూస్తున్నదని ఆరోపిస్తున్నారు.  కనీసం గ్రౌండ్లోకి కూడా రానివ్వకుండా రోడ్డుపై ఎండలో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం తమకేం పట్టనట్లు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు