రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి ట్రైబల్ వెల్ఫేర్ స్కూట్​ స్టూడెంట్లు వివిధ క్రీడల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు ప్రిన్సిపల్ శైలజ రాణి తెలిపారు. రాజస్థాన్ జోధ్పూర్ లో జరిగిన సపక్ త్రాక్ జాతీయ క్రీడల్లో అండర్–19 విభాగంలో  వి.దివ్య , 72వ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ సీనియర్ మహిళా విభాగంలో ఎల్.స్రవంతి, బి.నాగేశ్వరి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా స్టూడెంట్లను ప్రిన్సిపల్ శైలజారాణి, వైస్ ప్రిన్సిపల్ ఆర్.శారద, పీడీ ఎం.అపర్ణ అభినందించారు.