పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. కోహ్లి,రోహిత్‌లు సాధించలేని ఘనత

పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. కోహ్లి,రోహిత్‌లు సాధించలేని ఘనత

మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టే.. క్రికెట్ లో గుర్తించలేని పసికూన ప్లేయర్లున్నారు. స్టార్ ప్లేయర్లనే గుర్తు పెట్టుకునే క్రికెట్ లవర్స్.. ఎంత బాగా రాణించినా అనామక ఆటగాళ్లను పట్టించుకోరు. చిన్న జట్లే అయినా కొంతమంది ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తారు. వారిలో ఐర్లాండ్ స్టార్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ ఒకరు. అంతర్జాతీయ స్టార్లు కోహ్లీ, రోహిత్, బాబర్ అజామ్, వార్నర్ అందుకోలేని ఘనతను సాధించి వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. 

టీ20 క్రికెట్ లో ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 400 ఫోర్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక ఫోర్లు కూడిన ప్లేయర్ గా నిలవడంతో పాటు ఈ మార్క్ చేరుకున్న తొలి ప్లేయర్ గా అరుదైన ఘనతను అందుకున్నాడు. నిన్న (మార్చి 15) శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మొదటి టీ 20లో తన 25 పరుగుల స్కోర్ లో రెండు ఫోర్లు కొట్టడంతో 400 మార్క్‌ను చేరుకున్నాడు. స్టిర్లింగ్ తర్వాత స్థానంలో పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ 395 ఫోర్లతో  రెండవ స్థానములో ఉన్నాడు. 

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 320 ఫోర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే స్వల్ప లక్ష్య ఛేదనలో  ఐర్లాండ్ 38 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. హ్యారీ టెక్టార్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 111 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ బౌలర్ వైట్ నాలుగు వికెట్లతో గెలుపులో కీలక పాత్ర పోషించాడు.