కొమురం భీమ్ చరిత్ర తెలుసుకోండి.. మన్ కీ బాత్ లో యువతకు ప్రధాని మోదీ పిలుపు

కొమురం భీమ్ చరిత్ర తెలుసుకోండి.. మన్ కీ బాత్ లో యువతకు ప్రధాని మోదీ పిలుపు

ఢిల్లీ: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. 'బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏండ్ల యువకుడుఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించు కున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భీమ్ గురించి యువత తెలుసు కోవాలి' అని మన్ కీ బాత్ బాత్ లో పిలుపునిచ్చారు.

స్వదేశీ ఉత్పత్తులే కొనాలె

పండుగల సమయంలో దేశ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. మన పండుగలు సామాజిక ఐక్యతకు ఉదాహరణ అని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు, సక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రభు త్వం సాధించిన విజయాన్ని ప్రశంసించారు. మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా దేశ ప్రజలంతా మొక్కలు నాటాలని, మన గ్రంథాలలో ఇదే విషయాన్ని వివరించారని గుర్తు చేశారు. ఈ నెల 31న జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని గుర్తు చేసుకున్న పీఎం.. ఆ రోజున దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.