IND vs AUS : నాలుగో టెస్టు మ్యాచ్ను వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు

 IND vs AUS : నాలుగో టెస్టు మ్యాచ్ను వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లో మార్చి 9 నుంచి స్టార్ట్ కానుంది.ఈ మ్యాచ్ ను  ఇరు దేశాల  ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంథోనీ అల్బనీస్  కలిసి వీక్షించనున్నారు. మార్చి 8 నుండి 11 వరకు  భారత్ లో పర్యటించనున్న ఆంథోనీ అల్బనీస్ మొదటి రోజు మ్యాచ్ ను మోడీతో కలిసి ఈ మ్యాచ్ ను చూడనున్నారు. 2017 తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఈ స్టేడియంలో రెండు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు టెస్టు మ్యాచ్ లు జరగగా ఇందులో టీమిండియా మొదటి రెండు టెస్టుల్లో గెలిచి ముందంజలో ఉంది. నాలుగో టెస్టు మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది.  ఎందుకంటే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి చేరాలంటే భారత్ జట్టు ఈ అహ్మదాబాద్ టెస్టులో తప్పక విజయం సాధించాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇక ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టు మ్యాచ్ లను స్పిన్ పిచ్ లపైనే ఆడించారు. మరో నాలుగో టెస్టు మ్యాచ్ ను ఏ పిచ్ పైన ఆడిస్తారో చూడాలి.