- మెదక్ డీఆర్ ఓకు పోచమ్మరాల్ రైతుల ఫిర్యాదు
మెదక్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదని కక్షగట్టి ఓడిన అభ్యర్థి పలువురు రైతుల వరినారు మళ్లకు గడ్డిమందు కొట్టిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. దీనిపై బుధవారం హవేలీ ఘనపూర్ మండలం పోచమ్మరాల్గ్రామ రైతులు కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్ఓ భుజంగరావుకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కురుమ సంఘం సర్పంచ్ అభ్యర్థి రూప్ సింగ్ కు మద్దతిచ్చినట్టు, అయినా.. ఎన్నికల్లో అతను ఓడిపోయాడని పేర్కొన్నారు.
కాగా.. కురుమ సంఘానికి డబ్బులు ఇచ్చినా తనకు ఓటేయలేదని కక్షగట్టి వరి నారుమళ్లకు గడ్డి మందు కొట్టాడని పలువురు రైతులు ఆరోపించారు. దాదాపు 40 కుటుంబాలకు చెందిన సుమారు 110 ఎకరాల్లో వరి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొందని డీఆర్ఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులకు నష్టం కలిగించిన సదరు వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరారు.
