V6 News

జబ్బాపూర్ లో పాఠశాల భవనానికి తాళం వేసిన యజమాని

జబ్బాపూర్ లో పాఠశాల భవనానికి తాళం వేసిన యజమాని
  •     రోడ్డెక్కి నిరసన చేసిన విద్యార్థులు

గజ్వేల్(వర్గల్​), వెలుగు: ప్రభుత్వం నుంచి అద్దె చెల్లింపు జరగకపోవడంతో అద్దె గదుల యజమాని తరగతి గదులకు తాళం వేశాడు. దీంతో వర్గల్​మండలం జబ్బాపూర్​లో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. గ్రామంలో  ప్రైమరీ స్కూల్​భవనాన్ని ఆరు నెలల కింద కూల్చివేయడంతో గ్రామంలో అద్దె భవనాన్ని తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని శనివారం గదులకు తాళాలు వేశారు. 

దీంతో విద్యార్థులు చేసేది లేక రోడ్డుపై బైఠాయించారు.  పాఠశాల భవనాన్ని వెంటనే నిర్మించి తమ ఇబ్బందులు తీర్చాలని నినాదాలు చేశారు. అద్దె చెల్లించి తమకు చదువు కొనసాగేలా చూడాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరసనలో పాల్గొన్నారు. విషయాన్ని తెలుసుకున్న సర్పంచ్ వెంకటేశ్​ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.