ఆందోళనకు దిగిన రైతులపై క్రిమినల్​ కేసులు

ఆందోళనకు దిగిన రైతులపై క్రిమినల్​ కేసులు

నిర్మల్‍, వెలుగు: వడ్ల పైసల్లో కోత పెట్టారని ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు క్రిమినల్​ కేసులు పెట్టారు. ఈ ఘటన నిర్మల్‍ జిల్లా సోన్​ మండలంలోని కడ్తాల్​లో జరిగింది. గ్రామానికి చెందిన రైతులు తాము పండించిన వడ్లను ప్రైమరీ అగ్రికల్చర్​ కో ఆపరేటివ్​ సొసైటీ (పీఏసీఎస్​)లో అమ్మేయగా ఇటీవల వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. అయితే.. తాము అమ్మిన వడ్లకు సరిప డా డబ్బులు పడలేవని, బస్తాకు ఐదు కిలోల చొప్పున కట్​ చేశారంటూ రైతులు ఈ నెల 8న కడ్తాల్​లో ఆందోళనకు దిగారు.

రైతులపై క్రిమినల్​ కేసులు

అక్కడికి వచ్చిన మంజులాపూర్‍  పీఏసీఎస్‍   సీఈవోను అడ్డుకున్నారు. దీంతో ఆయన విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ముగ్గురు రైతులపై శనివారం క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. ఇందులో గుర్రం పోచులు, బార్మా మారుతి, గంగయ్య ఉన్నారు. పోలీసుల తీరుపై రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. న్యాయం కోసం ఆందోళనకు దిగిన వారిపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు