ఆర్టీఏ ఏజెంట్లు అరెస్ట్.. ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారీ

ఆర్టీఏ ఏజెంట్లు అరెస్ట్.. ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారీ

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్టీఏ ఏజెంట్లను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, ఆదిబట్ల పోలీసులు  పట్టుకున్నారు. ఈ ఘటన 2023 జూలై 05 బుధవారం రోజు చోటుచేసుకుంది.  రంగారెడ్డి జిల్లా మన్నెంగూడ ఆర్టీఏ  ఆఫీస్ దగ్గర ఆరుగురు ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు ఆరెస్ట్ చేశారు.  నకిలీ డాక్యుమెంట్లతో ప్రజల దగ్గర  డబ్బులు వసూలు చేస్తు్ండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. 

సంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనే ప్రధాన నిందితుడితో పాటు  కొంగల ఆనంద్, అడుశెట్టి వేణు, పుట్టబత్తిని శ్రీధర్, అనుపాటి శ్రీశైలం, చాపల యాదగిరిలుగా పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు.  నిందితుల నుంచి నకిలీ  ఇన్సురెన్స్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డులు, రెండు లాప్ ట్యాప్ లు,పెన్ డ్రైవ్ లు, 18 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.   

ఎక్స్‏పైరీ డేట్ అయిపోయిన సర్టిఫికేట్‌లను స్కాన్ చేసి తేదీలను సవరించి ఆర్టీఏకు సమర్పిస్తున్నారని పోలీసులు తెలిపారు.  నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.