- విచారణ పెండింగ్‌లో ఉండడంతో పొడిగించే చాన్స్
- ప్రభుత్వానికి ఫైల్.. త్వరలో ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్గడువును మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉంది. గురువారంతో కమిషన్గడువు తీరనున్న నేపథ్యంలో మరోసారి పొడిగించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌జడ్జి జస్టిస్పీసీ ఘోష్చైర్మన్గా ప్రభుత్వం కమిషన్‌ఏర్పాటు చేసింది.
అయితే విచారణ పూర్తి కాకపోవడం, ఇంకా కొందరు ఐఏఎస్అధికారులను విచారించాల్సి ఉండడం, కాంట్రాక్ట్ఏజెన్సీలు, సబ్‌కాంట్రాక్ట్ సంస్థలూ విచారణకు రావాల్సి ఉండడంతో మరోసారి గడువు పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.
విచారణ గడువును పొడిగించాలని కమిషన్ నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే ఫైల్పంపినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో కమిషన్ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల తొలి వారంలో దానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉంది.
రెండుసార్లు పొడిగింపు..
కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తొలుత జూన్ 30 వరకు గడువు ఇచ్చారు. ఆ టైంలోగా నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, విచారించాల్సిన అధికారులు ఎక్కువ మంది ఉండడం, ప్రాజెక్టులో చాలా వరకు సాంకేతికాంశాలు ముడిపడి ఉండడంతో విచారణ పూర్తి కాలేదు. తొలుత 60 మంది వరకు రిటైర్డ్, ప్రస్తుత ఇంజనీర్లను పిలిచిన కమిషన్.. వారి నుంచి వివరాలు సేకరించి అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఆ విచారణను కొనసాగించాల్సి రావడంతో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. దీంతో రెండో దశలో రిటైర్డ్ ఐఏఎస్‌లను కమిషన్ విచారణకు పిలిచింది. అప్పటికే టెక్నికల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం, విజిలెన్స్ రిపోర్టు రెడీ కాకపోవడం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆలస్యమవడం వంటి కారణాలతో గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఈ దశలో ఓపెన్ కోర్టు ద్వారా దాదాపు 30 మంది అధికారులను కమిషన్ విచారించింది. ఐఏఎస్‌లు పలు డాక్యుమెంట్లను సమర్పించకపోవడం, వారిని ఓపెన్ కోర్టులో విచారించాల్సి ఉండడంతో మరోసారి గడువును పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.