పోస్ట్ కోవిడ్ కేసులు పెరుగుతున్నయ్

పోస్ట్ కోవిడ్ కేసులు పెరుగుతున్నయ్

కరోనా కొత్త చిక్కులు తెస్తోంది. కరోనా వచ్చింది.. తగ్గిందిలే అనుకుంటే పొరపాటే. కరోనా తగ్గాక కూడా.... ఇతర అవయవాల మీద ప్రభావం చూపిస్తోందని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు పెరగడంతో.... నెలల తరబడి ట్రీట్మెంట్ పొందుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కరోనా వచ్చి... మైల్డ్ సింటమ్స్ తో తగ్గిపోతే పోస్ట్ కరోనాలో పెద్దగా సమస్యలు రావట్లేదు. కానీ.. కరోనాతో ఆయాసం వచ్చి.. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం.. తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మోడరేట్, సివియర్ సింటమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కొందరిలో కరోనా నెగిటివ్ వచ్చినా.... లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు. లంగ్స్ తో పాటు.. ఇతర పార్ట్స్ మీదా ప్రభావం చూపిస్తోంది కరోనా. దీంతో... పోస్ట్ కోవిడ్ భాదితులు హాస్పిటల్స్ కు క్యూ కడుతోన్నారు. ప్రస్తుతం హాస్పిటల్స్ లో కరోనా పేషంట్స్ తగ్గినా.. పోస్ట్ కోవిడ్ తో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. 

కరోనా వైరస్ బాడీలోకి వచ్చాక మొదట లంగ్స్ పై దాడి చేస్తుంది. అక్కడ రక్తనాళాలకు లింకేజ్ ఉండే ఎండోథెలియల్ కణాలపై ఎటాక్ చేస్తుంది. ఈ ఎటాక్ ఎదుర్కొనేందుకు.. రక్త నాళాల దగ్గర కొన్ని ప్రొటీన్లు విడుదలవుతాయి. వీటితో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతోంది. కరోనా తగ్గిన వెంటనే కాకుండా.. కొన్ని నెలల తరువాత... ఈ సమస్యలు రావొచ్చంటున్నారు డాక్టర్లు. ఇలాంటి పేషంట్స్ బ్లడ్ పలుచన చేసే మెడిసిన్ వాడాలంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా.... 30 శాతం మందిలో లంగ్స్ దెబ్బతింటున్నాయి. నాళాల్లో రక్తం గడ్డలు కట్టి లంగ్స్ పాడవుతున్నాయి. ఈ సమస్య కొందరిలో కరోనా వచ్చిన ఒకట్రెండు నెలలకు బయటపడటంతో.. పేషంట్లు వర్రీ అవుతున్నారు. మరికొందరిలో కరోనా వచ్చినప్పుడు పెద్దగా సింటమ్స్ లేకపోయినా.. తరువాత ఆయాసం వస్తోందంటున్నారు డాక్టర్లు. అలాంటప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. గాంధీ హాస్పిటల్ లో కొందరు పోస్ట్ కోవిడ్ పేషంట్స్... 3 నెలలుగా బెడ్ మీదే ట్రీట్మెంట్ పొందారు. దాదాపు 2 వందల మంది లాంగ్ టైం ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీళ్ళల్లో 85 శాతం మంది ICUలోనే ఉన్నారు. 33 యేళ్ళ ఓ వ్యక్తికి 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు గాంధీ డాక్టర్లు చెబుతున్నారు. రోజుకి 150 మంది వరకూ పోస్ట్ కోవిడ్ సమస్యలతో గాంధీకి వస్తున్నారు. హాస్పిటల్ కు వస్తోన్న ప్రతి వంద మందిలో 80 శాతం మంది కండరాల బలహీనత, నీరసం లాంటి సమస్యలు చెబుతున్నారు. మిగిలిన 20 శాతం మందిలో జ్నాపకశక్తి నశించడం, డయేరియా, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. 

 కోవిడ్ నుంచి కోలుకున్నాక .. మానసిక పరిస్థితి మెరుగయ్యేందుకు.. యోగా, వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు హెల్తీ ఫుడ్ మంచిదే అయినా.. విపరీతంగా తినవద్దని చెబుతున్నారు. అలాంటి వారిలో డయేరియా కడుపునొప్పి, కళ్లు తిరగడం, వాంతులు లాంటి ఇతర రోగాలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు.  కరోనా వచ్చిన వారు.. స్టెరాయిడ్స్ ఎక్కువగా తీస్కోవడం కూడా.. ఇలా పోస్ట్ కోవిడ్ సమస్యలకు కారణమంటున్నారు డాక్టర్లు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలే కానీ.. లైట్ తీస్కోవద్దని హెచ్చరిస్తున్నారు.