- స్కిల్స్ ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు
- అంబేద్కర్ లా కాలేజీలో కాకా యూత్ పార్లమెంట్
- హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి
- బాగా నిర్వహించారని కితాబు
ముషీరాబాద్, వెలుగు: లాయర్లకు క్రెడిబిలిటీ చాలా అవసరమని రాష్ట్ర మంత్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. లా చదివే స్టూడెంట్స్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, క్రమశిక్షణతో స్కిల్స్ పెంచుకుంటే దేశం, ప్రపంచంలో ఏ రంగంలోనైనా రాణించవచ్చని చెప్పారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో కాకా యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యూత్ పార్లమెంట్ చక్కటి కార్యక్రమమన్నారు. యువత రాజకీయాల్లో రాణించి విధాన నిర్ణయాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. జీవితంలో రాజ్యాంగ విలువలు ప్రతిబింబించే విధంగా విద్యార్థులు ఉండాలని సలహా ఇచ్చారు. యూత్ పార్లమెంట్‌ను చక్కగా నిర్వహించారని కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రమణ కుమార్, సీఈవో డాక్టర్ లింబాద్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన, లా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
