రివ్యూ: రాధేశ్యామ్

రివ్యూ: రాధేశ్యామ్

రివ్యూ: రాధేశ్యామ్
రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, బాగ్యశ్రీ, సచిన్ కేద్కర్, జయరాం, జగపతిబాబు, రిద్ది కుమార్, ప్రియదర్శి తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
పాటలు: జస్టిన్ ప్రభాకరన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: తమన్
నిర్మాతలు: యు.వి క్రియేషన్స్
రచన ,దర్శకత్వం: రాధ కృష్ణ కుమార్
రిలీజ్ డేట్: మార్చి 11,2022

కథేంటి?
రాధేశ్యామ్ 1976లో జరిగే కథ. ప్రపంచవ్యాప్తంగా జోతిష్యంలో పాపులర్ అయిన విక్రమాదిత్య (ప్రభాస్) తన చేతిరేఖల్లో ప్రేమ లేదని అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తుంటాడు. అందులో భాగంగానే ప్రేరణ (పూజా హెగ్డే )అనే డాక్టర్ పరిచయమవుతుంది. తనకు బాగా దగ్గరవుతాడు. కానీ తను కొన్ని నెలల్లో చనిపోతుందనీ, తనకు క్యాన్సర్ ఉందని వాళ్ల ఫ్యామిలీ అంటే..తన చేతి చూసి తను 100 ఏళ్లు బతుకుతుందని చెప్తాడు. తర్వాత ఏం జరిగింది సైన్స్ గెలిచిందా? విక్రమాదిత్య తన చేతిరేఖల్లోనే ప్రేమను చివరికి పొందాడా లేదా అనేది కథ.
 

నటీనటుల పర్ఫార్మెన్స్:
ప్రభాస్ ను ముందుగా అభినందిచాల్సింది. బాహుబలి, సాహో లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ల తర్వాత ఇలాంటి కంప్లీట్ లవ్ స్టోరి చేసేందుకు ముందుకు రావడం నిజంగా రిస్కే. తన నటన పరంగా వంక పెట్టలేం. విక్రమాదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. కానీ తన లుక్స్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకోవాలి. ఎనర్జీగా కనిపించటం లేదు. పూజా హెగ్డే చాలా అందంగా ఉంది. ప్రేరణ పాత్రలో మంచి నటనతో మెప్పించింది.వీళ్లిద్దరి కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇక కృష్ణంరాజు గురువు పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సచిన్ కేద్కర్, జయరామ్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. జగపతిబాబును సరిగా వాడుకోలేదు. భాగ్యశ్రీ జస్ట్ ఓకె. మిగతా పాత్రల గురించి చెప్పుకోవాడాలనికేం లేదు.
 

టెక్నికల్ వర్క్:
సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంది. నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. అదంగా స్క్రీన్ పైన తెలుస్తుంది. మనోజ్ పరమహంస విజువల్స్ పెయింటింగ్ లాగా ఉన్నాయి. ప్రతీ సీన్ గ్రాండ్ గా ఉంది. జస్టిన్ ప్రభాకరన్ పాటల్లో మూడు వినసొంపుగా ఉన్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పనితనం మెప్పిస్తుంది. 1976 నాటి ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉన్నాయి. రాధ రాసుకున్న కథ, మాటలు పొయెటిక్ గా ఉన్నాయి.
 

విశ్లేషణ:
‘‘రాదే శ్యామ్’’ ఓ డిఫరెంట్ లవ్ స్టోరి అని చెప్పుకోవాలి. మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ ఇలాంటి లవ్ స్టోరి చేయడం వల్ల ఫ్యాన్స్  కొంత నిరాశపడతారు. అయితే డైరెక్టర్ రాధ అనుకున్న పాయింట్ కొత్తగానే అనిపించినా.. స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. స్లో నరేషన్ కావడం వల్ల కాస్త బోర్ కొడుతుంది. ఫస్టాఫ్ నెమ్మదిగా మొదలై ఇంటర్వెల్ ముందు ఇంట్రెస్ట్ కలిగించింది.సెకండాఫ్ కూడా అంతే బాగుంటుందని అనుకుంటే డిజప్పాయింట్ అవుతారు ప్రేక్షకులు. సెకండాఫ్ లో ఎక్కడా కూడా ఒక హై ఉన్న సీన్ లేదు. క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. షిప్ సీన్ బాగా డిజైన్ చేశారు. అక్కడక్కడా మెరుపులు తప్పా పెద్దగా రాధేశ్యామ్ గురించి చెప్పుకోవడానికేం లేదు.పెద్ద సినిమా అని వెళ్లే ఆడియన్స్ ఈ ట్రీట్ మెంట్ నచ్చక పెదవి విరుస్తారు. కానీ క్లాస్ ఆడియన్స్ కు ఫరవాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా రాధేశ్యామ్ అంచనాలను అందుకోలేకపోయింది.