గ్రాండ్ చెస్ టూర్‌: నాలుగో ప్లేస్లో ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్‌: నాలుగో ప్లేస్లో ప్రజ్ఞానంద

జాగ్రెబ్‌‌‌‌ (క్రొయేషియా): ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. గ్రాండ్‌‌‌‌ చెస్‌‌‌‌ టూర్‌‌‌‌లో నిరాశపర్చాడు. ర్యాపిడ్‌‌‌‌లో అద్భుతంగా రాణించినా.. బ్లిట్జ్‌‌‌‌లో విఫలమయ్యాడు. శనివారం రాత్రి తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి 15.5 పాయింట్లతో  నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. తొలి గేమ్‌‌‌‌లో విన్సెంట్‌‌‌‌ కేమర్‌‌‌‌ (జర్మనీ)పై గెలిచిన ప్రజ్ఞా.. అనీష్‌‌‌‌ గిరి (నెదర్లాండ్స్‌‌‌‌)తో జరిగిన గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన నాలుగు గేమ్‌‌‌‌ల్లో ఓడిపోయాడు.

దాంతో మూడున్నర పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌ నాలుగు పాయింట్లు సాధించినా.. ఓవరాల్‌‌‌‌గా 13.5 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు. అలీరెజా ఫిరౌజా (ఫ్రాన్స్‌‌‌‌) 20 పాయింట్లతో టాప్‌‌‌‌లో ఉండగా, మాగ్జిమ్‌‌‌‌ వాచియర్‌‌‌‌ లాగ్రెవ్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌), నొడిర్బెక్‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌) చెరో 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌‌‌‌లో ఉన్నారు.