నేటి నుంచి సెలవులు ఉండడంతో శుక్రవారం ఉమ్మడి జిల్లాలో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రభుత్వ పాఠశాల, ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్, విజన్ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబురాలు జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా బోగి మంటలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు. కైట్స్ఎగురవేశారు. గంగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. మరిపెడ/ వెంకటాపురం/ కొత్తగూడ, వెలుగు
