లాకర్ దొంగతనం కేసులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్..

లాకర్  దొంగతనం కేసులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్..

చెన్నైలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాకర్‌లో కొద్దిరోజుల క్రితం ఓ దొంగతనం జరిగింది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు  బ్యాంకు ఉద్యోగిని అరెస్టు చేసి, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

 వివరాలు చూస్తే... అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయురాలు (NRI) అయిన స్వరూప రాణికి వేలాచేరి బ్రాంచ్‌లో బ్యాంక్ లాకర్‌ ఉంది. ఆమెతో పాటు చెన్నైలోని తన తల్లికి లాకర్‌ వాడేందుకు (యాక్సెస్) అనుమతి ఉంది.

అయితే కుటుంబ సభ్యులు ఓ రోజు లాకర్‌ చెక్ చేస్తుండగా  238 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20.6 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించారు.

దింతో  స్వరూప రాణి సోదరుడు సెంథిల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నవంబర్ 12న కేసు నమోదు చేసి దర్యాప్తు  ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా బ్యాంకులో గ్రేడ్-II మేనేజర్, లాకర్ల ఇన్‌చార్జ్ అయిన ఉద్యోగిపై పోలీసులకు అనుమానం వచ్చింది.

 దింతో విచారించగా బ్యాంక్ ఉద్యోగి ఎవరి అనుమతి లేకుండా లాకర్‌ తెరిచి బంగారాన్ని కొట్టేసినట్లు బయటపడింది. కొట్టేసిన బంగారాన్ని వేలచేరిలోని ఒక పాన్ షాపు యజమానికి రూ. 21 లక్షలకు అమ్మాగా.., మిగతా మొత్తం బ్యాంకులోనే దాచాడు.

చివరికి  సీసీబీ పోలీసులు రూ. 20.6 లక్షల నగదుతో పాటు, కరిగించిన 188 గ్రాముల బంగారాన్ని కూడా రికవరీ చేశారు. ఈ కేసులో నిందితుడిని సైదాపేటలోని కోర్టులో హాజరుపరిచి, పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.