రియాలిటీ షోస్, వెబ్ సిరీసులతోపాటు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది ప్రియమణి. రీసెంట్గా ‘భామా కలాపం’ అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల
ముందుకొచ్చింది. అద్భుతంగా నటించిందంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. ఈ సందర్భంగా కాసేపు ఇలా కబుర్లు చెప్పింది.డైరెక్టర్ స్టోరీ చెప్పిన విధానం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఎలా చెప్పారో అలాగే తీశారు. నార్మల్ మిడిల్ క్లాస్ వైఫ్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు. కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. బాగా వర్కవుటయ్యింది. ఇప్పటివరకు ఎవరూ తీసుకోని టాపిక్. అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది.ఇందులో నేను చేసిన అనుపమ పాత్ర నాకు రెండు వందల శాతం సంతృప్తినిచ్చింది. చూసినవాళ్లంతా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ మాత్రం నా భర్త నుంచి వచ్చింది. ఆయన యూఎస్‌లో ఉంటారు. అక్కడే సినిమా డౌన్లోడ్ చేసుకుని చూశారు. తనకి చాలా నచ్చిందట. శారీలో చాలా అందంగా ఉన్నానన్నారు. మొదటిసారి చేసినా కామిక్ రోల్‌కి బాగా సూటయ్యానని, అలాంటి రోల్స్ వస్తే మరిన్ని చేయమని చెప్పారు.
బోల్డ్, స్ట్రెయిట్ పార్వార్డ్ పాత్రలు చేయడం ఈజీనే. కానీ అమాయకంగా నటించడం కష్టం. అందుకే చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే మిడిల్ క్లాస్ హౌస్ వైవ్స్ ఇంట్లో ఎలా ఉంటారు, టిపికల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్టవుతారు అనేవి పరిశీలించి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇక రియల్ లైఫ్‌లో నాకు వంట చేయడం అస్సలు రాదు. ఎప్పుడైనా మావారు చేస్తే నేను తింటాను తప్ప వంట చేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు కూడా. అనుపమ అందరి జీవితాల్లోకీ వెళ్లిపోతుంది. కానీ బేసిగ్గా నేను ఎవరి లైఫ్‌లోనూ కల్పించుకోను. అనుపమ లాగా ఎవరూ ఉండకూడదు కూడా. ఇలాంటి హ్యాబిట్స్ ఉండటం చాలా తప్పు. అయినా నేను ఏ పాత్రతోనూ పర్సనల్‌గా కనెక్టవ్వను. సినిమా పూర్తవగానే దానికి సంబంధించనవన్నీ మరిచిపోతాను. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఇంపార్టెన్స్ బాగా పెరుగుతోంది. అది సంతోషించదగ్గ విషయం. నాకు కూడా మరిన్ని బలమైన పాత్రలు చేయాలనుంది. ముఖ్యంగా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయాలని కోరిక. మంచి సబ్జెక్ట్ దొరికితే చేస్తాను. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ రిలీజే బెస్ట్. అందుకే ఈ సినిమాని ఆహాలో రిలీజ్ చేశారు. ఓటీటీల కారణంగా వెరైటీ రోల్స్ చేయడానికి మాకు కూడా అవకాశం దొరుకుతోంది. డైరెక్టర్స్ విజన్ పుణ్యమా అని డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషించగలుగుతున్నాం.ప్రస్తుతం కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ‘విరాటపర్వం’ రిలీజ్‌కి రెడీగా ఉంది. భారతక్క అనే పవర్ఫుల్ రోల్ చేస్తున్నా. రానాకి సబార్డినేట్ నక్సలైట్‌గా కనిపిస్తాను. హిందీలో అజయ్ దేవగన్ ‘మైదాన్’, కన్నడలో ‘డాక్టర్ 56’ షూటింగ్స్ పూర్తయ్యాయి. త్వరలో రిలీజవుతాయి. తమిళంలోనూ ఒక సినిమా చేస్తున్నాను. అందులో జాకీష్రాఫ్, సన్నీ లియోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘ఫ్యామిలీ మేన్ 3’ త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది.