కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌ తో మహిళ మృతి.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఘటన

కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌ తో మహిళ మృతి.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఘటన

చెన్నూరు, వెలుగు : విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి వచ్చిన గాలివానకు విద్యుత్‌‌‌‌‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌ తెగి మేడగోని జ్యోతి (47)ఇంటి వద్ద దుస్తులు ఆరేసే తీగపై పడింది. దీనిని గమనించిన జ్యోతి మంగళవారం ఉదయాన్నే దుస్తులు ఉతికి తీగపై ఆరేస్తుండగా.. షాక్‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. జ్యోతి భర్త గతంలోనే చనిపోగా కూలీ పని చేసుకుంటూ ఇద్దరు కూతుర్లు, కుమారుడిని పోషిస్తోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు.