పిఠాపురంలో లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం: కొరటాల శివ

పిఠాపురంలో లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం: కొరటాల శివ

రాజేంద్ర ప్రసాద్‌‌ ప్రధాన పాత్రలో ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘పిఠాపురంలో’. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పట్టుకో బాబా’ సాంగ్‌‌ లాంచ్ చేసిన దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘చంద్ర మహేష్ గారు అప్పట్లో తీసిన బ్లాక్ బస్టర్ 'ప్రేయసి రావే'కి నేను రైటింగ్ అసిస్టెంట్‌‌గా పని చేశా. 

నేటితరం యువత ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న  సమస్యలు, తల్లిదండ్రులతో  వాళ్ళకున్న కమ్యూనికేషన్ గ్యాప్‌‌ని చర్చిస్తూ  రిలేషన్ షిప్స్, అండర్‌‌‌‌స్టాండింగ్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం చాలా మంచి విషయం. ఇలాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. 

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ పాట కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు మహేష్ చంద్ర అన్నారు. పృథ్వీరాజ్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్‌‌.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) నిర్మిస్తున్నారు.