సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అంటూ సాగే మొదటి పాటను గురువారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సత్య డిఫరెంట్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు.
‘మత్తు వదలరా’ మూవీకి వర్క్ చేసిన మెయిన్ టీం ఈ సినిమాకు పనిచేస్తున్నారు. మ్యూజిక్ కాలభైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్‌తో కలిసి రితేష్ రానా మరోసారి తనదైన హాస్యాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు.
