ఆటగాళ్ళ తప్పుకు.. కెప్టెన్ బలయ్యాడు: పుజారా సస్పెండ్

ఆటగాళ్ళ తప్పుకు.. కెప్టెన్ బలయ్యాడు: పుజారా సస్పెండ్

టీమిండియా స్టార్ ఆటగాడు, నయావాల్ చటేశ్వర్ పుజారాకు ఇంగ్లాండ్ కౌంటీలో చేదు అనుభవం ఎదురైంది. కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా సస్సెక్స్ జట్టుకి కెప్టెన్ గా ఉన్న పుజారాను సస్పెండ్ చేశారు. ఇప్పటికే సస్సెక్స్ జట్టుకి 12  పెనాల్టీ పాయింట్లు విధించగా నిబంధనల ప్రకారం జట్టు కెప్టెన్ ఒక మ్యాచ్ కి దూరం కావాల్సి వస్తుంది. దీంతో పుజారాపై సస్పెన్షన్ వేటు తప్పలేదు. 

ఇంగ్లాండ్ నిబంధనలు ఏం చెబుతన్నాయంటే..

సాధారణంగా ఒక జట్టు నాలుగు ఫిక్సడ్ పెనాల్టీలను ఎదుర్కొంటే ఆ జట్టు కెప్టెన్ ని ఒక మ్యాచ్ సస్పెండ్ చేస్తారు. ఇప్పటికే సస్సెక్స్ జట్టు టోర్నీ ప్రథమార్ధంలో రెండు, ఈ నెల 13 న లీచెస్టర్ తో మ్యాచులో భాగంగా మరో రెండు పెనాల్టీలను ఎదుర్కొంది. ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ప్రవర్తన కారణంగా ఇంగ్లాండ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, వారి కార్వాలాస్ లు మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో ఆ జట్టుకి కెప్టె గా ఉంటున్న పుజారా బలైపోయాడు.

ALSO READ: ఆసీస్తో వన్డే సిరీస్.. రోహిత్కు రెస్ట్.. కెప్టెన్గా రాహుల్
  
ఈ ఛాంపియన్ షిప్ లో భాగంగా సస్సెక్స్ జట్టు 124 పాయింట్లతో అయిదవ స్థానంలో కొనసాగుతుంది. షెడ్యూల్ లో ప్రకారం ఈ నెల 19 న డెర్బీషేర్ తో 26 న గ్లోస్టర్ షేరు తో మ్యాచులు ఆడాల్సి ఉంది. 198 పాయింట్లతో డర్హం టాప్ లో ఉంది.