పీవీ సేవలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి : మాదంశెట్టి అనిల్ కుమార్

పీవీ సేవలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి : మాదంశెట్టి అనిల్ కుమార్

బషీర్​బాగ్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జూన్ 28న న్యూఢిల్లీలో జరిగే పీవీ.నరసింహారావు మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమ పోస్టర్, యూట్యూబ్ ఛానల్​ను పీవీ.నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాదంశెట్టి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో గురువారం ఆవిష్కరించారు. 

పీవీ సోదరుడు మనోహర్ రావు, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, మాజీ డీజీపీ హెచ్.జె.దొర, సీనియర్ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, ఆర్టీఏ మాజీ కమిషనర్ విజయ్ బాబు హాజరై, పీవీ చిత్రపటానికి నివాళి అర్పించారు. బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి, గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసిన మహనీయుడని కొనియాడారు. పీవీ స్మారక అవార్డును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయికి ప్రకటించామని, పురస్కారాన్ని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషికి అందించనున్నట్లు అనిల్​కుమార్​తెలిపారు. హైకోర్ట్ అడ్వకేట్ శ్రీకర్ శర్మ తదితరులున్నారు.