Sunrisers Hyderabad: లక్డీకాపుల్ లివింగ్‌స్టోన్.. సన్ రైజర్స్ కొత్త ప్లేయర్ కు నామకరణం చేసే పనిలో తెలుగు ఫ్యాన్స్

Sunrisers Hyderabad: లక్డీకాపుల్ లివింగ్‌స్టోన్.. సన్ రైజర్స్ కొత్త ప్లేయర్ కు నామకరణం చేసే పనిలో తెలుగు ఫ్యాన్స్

ఐపీఎల్ సీజన్ ప్రారంభమైతే చాలు హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయడానికి మన ఫ్యాన్స్ అందరికంటే ముందుంటారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లకు తెలుగు ఫ్యాన్స్ ఇచ్చే కొన్ని పేర్లు చాలా  గమ్మత్తుగా ఉంటాయి. హైదరాబాద్ లో ఒక్కో నగరంలో ఒక్కో ప్లేయర్ కు అంకితం చేశారు. పంజాగుట్టా పాట్ కమ్మిన్స్, హై టెక్ సిటీ హెడ్,  అమీర్ పేట్ అభిషేక్ శర్మ, కూకట్ పల్లి క్లాసన్ అంటూ ఇక్కడ ఒక్కో ప్లేయర్ ను మన జట్టు సొంతం చేసుకుంది. తాజాగా సన్ రైజర్స్ జట్టులో ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ లివింగ్ స్టోన్ కు కొత్తగా నామకరణం ఛీ పనిలో ఉన్నారు.  

ALSO READ : ముగ్గురు మొనగాళ్లకు మొండి చెయ్యి: టీ20 వరల్డ్ కప్‌లో స్థానం కోల్పోయిన మ్యాచ్ విన్నర్లు వీరే

ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కు ఒక కొత్త పేరు సెట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం లివింగ్ స్టోన్ పేరును జపిస్తూ సన్ రైజర్స్ క్రికెట్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. SRH స్టార్లు పంజాగుట్ట పాట్ కమ్మిన్స్, హైటెక్ సిటీ హెడ్, అమీర్‌పేట్ అభిషేక్  కూకట్‌పల్లి క్లాసేన్ వంటి వారి హైదరాబాద్ స్టైల్ మారుపేర్లతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ పేజీ అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ లివింగ్‌స్టోన్‌కు ఒక కొత్త పేరు కావాలని సూచిస్తున్నారు. దీనికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రకరకాల పేర్లు చెప్పుకొస్తున్నారు. లివింగ్ స్టోన్ కు నెటిజన్స్ ఈ పేర్లు సూచిస్తున్నారు..  

లాంగర్‌హౌస్ లివింగ్‌స్టోన్

లక్డికాపుల్ లివింగ్‌స్టోన్

లింగంపల్లి లివింగ్‌స్టోన్

లాలాగూడ లివింగ్‌స్టోన్

LB నగర్ లివింగ్‌స్టోన్

లాల్దర్వాజా లివింగ్‌స్టోన్

లాలాపేట్ లియామ్

లిబర్టీ లివింగ్‌స్టోన్

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో లివింగ్‌స్టోన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేశారు. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో మొదట అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఈ ఇంగ్లాండ్ వీరుడు.. చివర్లో భారీ ధరకు అమ్ముడుపోయాడు. కనీస ధర రూ.2 కోట్లతో ఆక్షన్ లోకి వచ్చిన లివింగ్ స్టోన్ ను దక్కించుకునేందుకు ప్రారంభం నుంచి సన్ రైజర్స్ పోటీపడింది. మొదట కేకేఆర్ పోటీలోకి రాగా.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బిడ్డింగ్ వార్ ను ఆసక్తికరంగా మార్చేసింది. గుజరాత్ తప్పుకోవడంతో అనూహ్యంగా లక్నో రేస్ లోకి వచ్చింది. 

ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ను కొనడానికి సన్ రైజర్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే బిడ్డింగ్ రూ.13 చేరడంతో లక్నో వద్ద డబ్బు లేకపోవడంతో వెనక్కి తగ్గింది. దీంతో రూ. 13 కోట్ల ధరకు లియామ్ లివింగ్‌స్టోన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్‌ కు బెంగళూర్ గుడ్ బై చెప్పింది. లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్ లోనూ పెద్దగా రాణించింది లేదు. 38 సగటుతో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ పవర్ హిట్టర్ ను ఆర్సీబీ రిలీజ్ చేసింది.