ఆయుష్మాన్ మందిర్ లో నాణ్యమైన వైద్యం

ఆయుష్మాన్ మందిర్ లో నాణ్యమైన వైద్యం

ఎల్కతుర్తి, వెలుగు: కేశవాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నాణ్యమైన వైద్య సేవలు  అందుతున్నాయని డీఎంహెచ్​వో  అప్పయ్య అన్నారు. జాతీయ వైద్య బృందం డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కృష్ణ సరన్ ఈ ఆరోగ్య మందిర్​ను గురువారం వర్చువల్ గా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ క్యూఏఎస్ మేనేజర్​సాగర్ తో కలిసి డీఎంహెచ్​వో  సందర్శించారు. 

బిల్డింగ్ నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో మెడికల్ వేస్టేజ్, పేషెంట్లు, గర్భిణులు, నవజాత శిశువులకు అందుతున్న సేవలు, కుటుంబ నియంత్రణ తదితరాల అమలు తీరును వైద్య బృందానికి వివరించారు. పీహెచ్​సీ వైద్యుడు శ్రీనాథ్​, పల్లె దవాఖాన మెడికల్​ఆఫీసర్ అరవింద్, వైద్యులు దుర్గాప్రసాద్, కవిత, భవాని తదితరులున్నారు.  

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

హసన్ పర్తి, వెలుగు: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ వో  అప్పయ్య సూచించారు. టీబీ సర్వేలో భాగంగా గురువారం హసన్ పర్తి పీహెచ్​సీని తనిఖీ చేశారు. 24 మందికి టీబీ, 27 మందికి హెచ్ఐవీ పరీక్షలు చేసినట్లు టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ హిమబిందు తెలిపారు. ఏఎన్ఎం సులోచన, హెల్త్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.