మరో 119 గురుకులాలు ఏర్పాటు చేయండి : ఆర్.కృష్ణయ్య

మరో 119 గురుకులాలు ఏర్పాటు చేయండి  : ఆర్.కృష్ణయ్య
  • దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య

మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతివిద్యార్థికి సీటు ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ ​చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ గురుకుల భవనాన్ని సంఘం నాయకులు నీలం వెంకటేశ్, గిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉన్న గురుకులాల్లో వసతి సౌకర్యం ఉన్నచోట 5, 6, 7, 8 తరగతుల్లో అదనపు సెక్షన్లు ప్రారంభించాలన్నారు. 

లక్షల సంఖ్యలో  అప్లికేషన్లు వస్తే వేల మంది  పిల్లలకు మాత్రమే సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఎంతోమంది తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి, ఆఫీస్​ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని, గురుకులాల సంఖ్యను పెంచాలని ఆయన కోరారు. నాయకులు అరవింద్, వెంకట్, శివ, నరేశ్, కౌశిక్, నిఖిల్ పటేల్ తదితరులు ఉన్నారు.