2025, సెప్టెంబర్ 17న కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. ఇప్పటికే కన్యా రాశిలో బుధ సంచారం జరుగుతుంది. సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడి రాకతో.. బుధాదిత్య యోగం ఏర్పడినట్లు చెబుతున్నారు పండితులు. ఈ బుధాదిత్యయోగం అనేది 42 రోజులు ఉంటుందని.. అంటే అక్టోబర్ 29వ తేదీ వరకు ఈ యోగం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంపై ఈ బుధాదిత్యయోగం ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఏయే రాశులు.. అంటే 12 రాశుల వాళ్లకు ఈ బుధాదిత్యయోగం ఎలా ఉంటుంది.. ఎవరి బాగుంటుంది.. బాగోలేని వారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది విషయాలను కూడా జ్యోతిష్య పండితులు వివరంగా చెబుతున్నారు. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో ధనుస్సు, మీనం, వృషభ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారం, విద్యా రంగంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు, .
- కర్కాటక రాశి వారికి మంచి అదృష్ట యోగం పడుతుందట. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగం... అన్ని అంశాల్లోనూ శీఘ్రగతిన పురోగతి ఉంటుందని పండితులు అంటున్నారు.
- సింహ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వీరి మాటకు, చేతకు విలువ పెరిగి.. . కుటుంబంలో జీవిత భాగస్వామికి, పిల్లలకు అంచ నాలకు మించిన పురోగతి ఉంటుంది.
- మిథునం, తుల రాశి వారు ఈ సమయంలో ఓర్పు, నిగ్రహం కలిగి ఉండాలి.
- మేషరాశి, కుంభరాశిపై సూర్యుని సంచారం మంచి ప్రభావం చూపదు. ఈ సమయంలో ఈ రాశులకు చెందిన వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది.
- కన్య రాశి వారు మరింత చురుకుగా ఉంటారు. సవాళ్లను సులభంగా ఎదుర్కొంటారు
- వృశ్చికరాశివారికి కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం తప్పకుండా మలుపు తిరుగుతుందంటున్నారు పండితులు . అనేక అంశాలలో పురోగతి... ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆర్థిక పురోగతి ఉండే అవకాశం ఉంది.
- ధనుస్సు రాశివారికి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అధికారం చేతికి వచ్చే అవకాశం ఉంది. ఒక పెద్ద వాణిజ్య సంస్థను నిర్వహించే అవకాశం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
చేయాల్సిన పరిహారాలు
- సూర్యభగవానుడికి నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యనమస్కారాలు చేయాలి,
- రాగి పాత్రలో నీటిని తీసుకుని.. అందులో ఎర్రటి పువ్వులు, అక్షతలు, బెల్లం వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
- ఓం ఘృణి సూర్యాయ నమః మంత్రాన్ని జపించండి. సూర్యుని ఆశీస్సులు , పూర్వీకులకు శాంతి రెండూ లభిస్తాయి.
- దానధర్మాలు, స్నానం, అర్ఘ్యానికి, నైవేద్యాల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి.
- పేదలకు ఆహారం, నువ్వులు, బట్టలు, దక్షిణ దానం ఇవ్వండి
- పూర్వీకులకు ప్రత్యేక తర్పణం, పిండ ప్రదానం, శ్రద్ధా కర్మలను చేయడం శుభప్రదంగా భావిస్తారు.
బుధుడి సొంతరాశి కన్యారాశిలో సూర్యుడుతో కలిసి ఉండటం చాలాశక్తివంతమైనదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏర్పడిన బుధాదిత్యయోగం.. తెలివి తేటలు.. సంపద.. కమ్యూనికేషన్ మొదలగు విషయాల్లో ప్రాధాన్యత ఉంటుంది.
