
తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ పోస్టులు–1000 ,శ్రామిక్ పోస్టులు 743 భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు 2025, అక్టోబర్ 8 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం https://www.tgprb.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
పోస్టులు..
డ్రైవర్లు పోస్టులు:1000
శ్రామిక్స్: 743
పైన సూచించిన ఖాళీల సంఖ్య తాత్కాలికం మాత్రమే.ఎటువంటి నోటీసు లేకుండా మారవచ్చు. నియామక ప్రక్రియలో ఏదైనా అంశానికి సంబంధించి అవసరమైన మార్పులను తెలిపేందుకు TSLPRBకి అధికారం ఉంది. శ్రామిక్ పోస్టులకు పురుషులు,మహిళలు అర్హులే.
వయోపరిమితి (జనరల్): 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి ,2025 జూలై 1 నాటికి 30 సంవత్సరాల వయస్సు నిండకూడదు. అయితే తెలంగాణ ప్రభుత్వం
GO ng.30 ద్వారా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్-ఎ) విభాగం తేదీ 08-02-2024 ద్వారా ప్రత్యక్ష నియామకంకోసం గరిష్ట వయోపరిమితిని 12 సంవత్సరాలకు పెంచింది.
విద్యార్హత: జూలై 1, 2025 నాటికి సంబంధిత ట్రేడ్‌లో మెకానిక్ (డీజిల్ / మోటార్ వెహికల్) లేదా షీట్ మెటల్ / MVBB లేదా ఫిట్టర్ లేదా ఆటో ఎలక్ట్రీషియన్ / ఎలక్ట్రీషియన్ లేదా పెయింటర్ లేదా వెల్డర్ లేదా కటింగ్ ,కుట్టుపని / మిల్‌రైట్ మెకానిక్ లేదా ఎక్సలెన్స్ తత్సమాన పరీక్షలో ITI ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్ లైన్దరఖాస్తుల స్వీకరణ : అక్టోబర్ 8,2025 నుంచి
ఆన్ లైన్దరఖాస్తుల సమర్పణకు చివరి తేది :అక్టోబర్ 28,2025
ఫీజు:
డ్రైవర్ పోస్టులకు:ఎస్సీ, ఎస్టీ లోకల్ క్యాండిడేట్లకు రూ. 300/–, ఇతరులకు రూ. 600/–
శ్రామిక్స్ పోస్టులకు:ఎస్సీ, ఎస్టీ లోకల్ క్యాండిడేట్లకు రూ. 200/–, ఇతరులకు రూ. 400/–