వాతావరణం, గ్రాస్‌‌‌‌‌‌‌‌ వల్లే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌: ద్రవిడ్‌‌‌‌‌‌‌‌

వాతావరణం, గ్రాస్‌‌‌‌‌‌‌‌ వల్లే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌: ద్రవిడ్‌‌‌‌‌‌‌‌

లండన్‌‌‌‌‌‌‌‌: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలన్న నిర్ణయాన్ని టీమిండియా చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ సమర్థించుకున్నాడు. మేఘావృత వాతావరణం, పిచ్‌‌‌‌‌‌‌‌పై గ్రాస్‌‌‌‌‌‌‌‌ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ‘కండిషన్స్‌‌‌‌‌‌‌‌ వల్లే మొదట బౌలింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాం. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు ఈజీగా ఉంటుందని భావించాం. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతాయి. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ 70/3 ఉన్నప్పుడు మా నిర్ణయం కరెక్టే అనిపించింది. కానీ తర్వాతి రెండు సెషన్స్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాం. కనీసం 300లోపు ఔట్‌‌‌‌‌‌‌‌ చేసినా ఈజీగా ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లం. మా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చాలా నిరాశపర్చింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో కొన్ని పేలవ షాట్స్‌‌‌‌‌‌‌‌తో వికెట్లు కోల్పోయాం’ అని ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.