సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి వాన దెబ్బ

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి వాన దెబ్బ
  • మూడు రోజుల్లో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం
  • సంస్థకు రూ.35 కోట్లకు పైగా వాటిల్లిన నష్టం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :ఎడతెరిపిలేని వానలతో సింగరేణి ఓపెన్​కాస్టుల్లో బొగ్గు వెలికితీతపై ఎఫెక్ట్ పడింది. మూడు రోజుల్లో లక్ష టన్నులకుపైగా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాదాపు రూ.35కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో ఓపెన్​కాస్ట్​ మైన్స్​కీలకంగా ఉన్నాయి.  

రాత్రి  షిఫ్ట్​లో వాన ఎక్కువగా కురుస్తుండడంతో ఎక్కడికక్కడే డంపర్లు నిలిచిపోతున్నాయి. బుధవారం శ్రీరాంపూర్​ఏరియా ఓసీల్లో 43 శాతం, మణుగూరులో 36, మందమర్రిలో 39, ఇల్లెందులో 65, ఆర్జీ–3లో 50, భూపాలపల్లిలో 43 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరిగింది. వరుస వానల కారణంగా ఓపెన్​కాస్టుల్లోని రోడ్లపై నుంచి డంపర్లు జారే చాన్స్ ఉండడంతో తవ్విన బొగ్గును కూడా పని ప్రదేశంలోనే నిల్వ ఉంచారు.