
రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్.. ఇప్పటికే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఫన్నీ నంబర్ ‘పప్పీ షేమ్’ సాంగ్‌ను ఆగస్టు 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రామ్ ఎనర్జిటిక్‌గా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. తన కెరీర్‌లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
కన్నడ స్టార్ ఉపేంద్ర, వీటీవీ గణేష్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 28న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
Fans…College…Mad fun!
— RAm POthineni (@ramsayz) September 4, 2025
“Aiyayayayooo poooyeee arey PUPPY SHAME ae aayyeee”#AndhraKingTaluka second single is #PuppyShame 🐶
Out on 8th September 💥
Music by @iamviveksiva & @mervinjsolomon#AKTOnNOV28 pic.twitter.com/ugxSIyEHja