రియల్‌మీ కొత్త సిరీస్ 5G ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ షేక్.. లాంచ్ ఎప్పుడంటే !

 రియల్‌మీ  కొత్త సిరీస్  5G ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ షేక్.. లాంచ్ ఎప్పుడంటే !

రియల్‌మీ (Realme) కంపెనీ మన  దేశంలో కొత్త ఫోన్లను తీసుకురాబోతోంది. అవే Realme Narzo 90 5G సిరీస్ ఫోన్లు. ఈ సిరీస్‌లో  Realme Narzo 90 Pro 5G సహా Realme Narzo 90x 5G అనే రెండు ఫోన్లు ఉండవచ్చు. ఈ కొత్త ఫోన్లు పాత మోడల్స్ కంటే చాలా మంచిగా ఉంటాయట. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే (స్క్రీన్) చాలా మెరుగ్గా ఉంటాయని కంపెనీ చెబుతోంది.

 ఈ ఫోన్ల లాంచ్ ఈవెంట్ గురించి రియల్‌మీ ఇంకా చెప్పలేదు. అయితే, డిసెంబర్ 9న అంటే రేపు మరిన్ని వివరాలు ప్రకటిస్తామని రియల్‌మీ చెప్పింది. కాబట్టి రేపు లాంచ్ తేదీ గురించి తెలిసే  అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని ఫోన్లు Amazon India వెబ్‌సైట్‌, Realme India వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంటాయి.
 
రియల్‌మీ ఇంకా ఫీచర్ల గురించి పూర్తిగా చెప్పకపోయినా, కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లాట్ అంచులు (Flat Frames), గుండ్రటి మూలలతో చూడటానికి బాగుంటాయట. ముఖ్యంగా Narzo 90 Pro 5Gలో మూడు లెన్స్‌లు, పక్కన రెండు చిన్న కటౌట్‌లతో కూడిన కెమెరా ఉంటుంది. అలాగే Narzo 90x 5Gలో మూడు లెన్స్‌లు,  ఫ్లాష్‌తో  గుండ్రని ఆకారంలో కెమెరా సెటప్ ఉంటుంది. ఈసారి పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఇవ్వొచ్చు.

కెమెరా క్లారిటీ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా క్లారిటీ  చాలా బాగుంటుందని చెబుతున్నారు. దీనిని 'స్నాప్ షార్ప్' అని టీజ్ చేశారు. అంటే, ఫోటోలు చాలా క్లియర్‌గా వస్తాయని అర్థం. ఈ సిరీస్ ఫోన్స్  కొన్నవారికి మంచి సేవలను అందించడానికి రియల్‌మీ Realme Care+ సేవలను కూడా అందిస్తుంది. ఇక ఈ ఫోన్ల ధర గురించి మాట్లాడితే  15వేల ధరతో మొదలై,  5G ఫోన్ల విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీగా ఉందట.