Anil Ambani: నష్టాల నుంచి లాభాల్లోకి అనిల్ అంబానీ కంపెనీ.. దూసుకుపోతున్న స్టాక్..

Anil Ambani: నష్టాల నుంచి లాభాల్లోకి అనిల్ అంబానీ కంపెనీ.. దూసుకుపోతున్న స్టాక్..

Reliance Power: అనిల్ అంబానీ ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో వినిపిస్తున్న పేరు. ఒకప్పుడు దివాలా తీసిన వ్యాపారవేత్తగా కనుమరుగైన అనిల్ ప్రస్తుతం తన కంపెనీలను లాభాల్లోకి తీసుకురావటం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. 

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ తన మెుదటి త్రైమాసికంలో రూ.44కోట్ల 68లక్షల లాభాన్ని నమోదు చేసింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.98 కోట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసింది. అలాగే ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5 శాతం తగ్గి రూ.వెయ్యి 885 కోట్లుగా నమోదయ్యాయి.

నేడు మధ్యాహ్నం 12.18 గంటల సమయంలో రిలయన్స్ పవర్ స్టాక్ ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.63.39 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. కంపెనీ షేర్లు ఇట్రాడేలో ఫ్లాట్ ట్రేడింగ్ చూస్తున్నాయి. అలాగే తొలి త్రైమాసికంలో కంపెనీ డెట్ ఈక్విటీ రేషియో కూడా రికార్డు స్థాయిలో తగ్గుదలను నమోదు చేసింది. వాస్తవానికి ఇదొక శుభ సూచికంగా నిపుణులు పరిగణిస్తుంటారు. 

ALSO READ : కాయిన్‌‌ ‌‌డీసీఎక్స్‌‌‌‌పై సైబర్ దాడి.. రూ.378 కోట్ల విలువైన క్రిప్టోలు కొట్టేసిన హ్యాకర్లు

కంపెనీ షేర్లు గడచిన మూడు నెలల కాలంలో 44 శాతం పెరుగుదలను చూశాయి. అలాగే గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 135 శాతం పెరుగుదలను చూశాయి. దీంతో అంబానీ ఈ  బ్యాక్ అని అర్థం చేసుకున్న ఇన్వెస్టర్లు చాలా మంది తమ పెట్టుబడి వ్యూహాలకు తిరిగి ప్రాణం పోస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.