కాయిన్‌‌ ‌‌డీసీఎక్స్‌‌‌‌పై సైబర్ దాడి.. రూ.378 కోట్ల విలువైన క్రిప్టోలు కొట్టేసిన హ్యాకర్లు

కాయిన్‌‌ ‌‌డీసీఎక్స్‌‌‌‌పై సైబర్ దాడి.. రూ.378 కోట్ల విలువైన క్రిప్టోలు కొట్టేసిన హ్యాకర్లు
  • కస్టమర్ అకౌంట్ నుంచి రూ.378 కోట్ల విలువైన క్రిప్టోలు కొట్టేసిన హ్యాకర్లు

న్యూఢిల్లీ: భారత క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ కాయిన్‌‌‌‌ డీసీఎక్స్ ఈ నెల 19న హ్యాక్‌‌‌‌కు గురైంది. ఈ కంపెనీకి చెందిన ఒక కస్టమర్ అకౌంట్‌‌‌‌ను హ్యాక్ చేసి 44.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.378 కోట్ల) విలువైన క్రిప్టోలు కొట్టేశారని అంచనా. ఇతర కస్టమర్ల ఫండ్స్ సురక్షితంగా ఉన్నాయని కంపెనీ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ సుమిత్ గుప్తా, నీరజ్ ఖండెల్వాల్ ఎక్స్‌‌‌‌లో హామీ ఇచ్చారు. ఒక కస్టమర్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన నష్టాన్ని కంపెనీ ట్రెజరీ నిధుల నుంచి భర్తీ చేస్తామని తెలిపారు. 

బ్లాక్‌‌‌‌చెయిన్ ఇన్వెస్టిగేటర్ జాక్‌‌‌‌ ఎక్స్‌‌‌‌బీటీ ఈ ఘటనను మొదట గుర్తించగా, 17 గంటల తర్వాత కాయిన్‌‌‌‌డీసీఎక్స్ పబ్లిక్‌‌‌‌గా బయటపెట్టింది. కాయిన్‌‌‌‌డీసీఎక్స్ వెబ్3 సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, ఆపరేషన్లను  సాధారణ స్థాయికి తీసుకొచ్చింది.  సెర్ట్‌‌‌‌ఇన్‌‌‌‌కు సమాచారం అందించి, రెండు గ్లోబల్ సెక్యూరిటీ ఏజెన్సీలతో ఫోరెన్సిక్ విచారణ జరుపుతున్నామని కంపెనీ పేర్కొంది.   కాగా,  గతేడాది వజీర్‌‌‌‌ఎక్స్  సైబర్ దాడుల వలన 230 మిలియన్ డాలర్లను నష్టపోయింది.