తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈయనతోపాటు మరో ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను, 10 మంది వైఎస్‌ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఏఐసీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం చాలా సుదీర్ఘ కసరత్తు చేసింది. అనేక నెలలపాటు తర్జన భర్జనలు చేసి.. ప్రజాభిప్రాయ సేకరణ టైప్ లో పార్టీలోని అన్ని స్తాయిల్లో విచారించిన తర్వాత ఎట్టకేలకు రేవంత్ రెడ్డికే సారధ్య బాద్యతలు అప్పగించింది. అలాగే ఆయనతోపాటు మరో ఐదుగురు వర్కింగ్ ప్రసిడెంట్లతో జంబో కార్యవర్గాన్ని నియమించారు. 
వర్కింగ్‌ ప్రెసిడెంట్లు
మహమ్మద్‌ అజారుద్దీన్‌
జె.గీతారెడ్డి
అంజన్‌ కుమార్‌ యాదవ్
జగ్గారెడ్డి
మహేష్‌ కుమార్‌ గౌడ్‌
వైస్‌ ప్రసిడెంట్లుగా 
సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లురవి, పొడెం వీరయ్య, సురేష్ షెట్కర్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి.కుమార్ రావు, జావేద్ అమీర్.

ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ
దాదాపు సీనియర్లందరినీ బుజ్జగించి అధికారంలోకి తీసుకురావడే టార్గెట్ గా కొత్త కమిటీ నియామకం జరిపింది. రాహుల్ గాంధీకి అంతరంగిక సన్నిహితుడైన మధుయాష్కీని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించింది. అలాగే ప్రచార కమిటీ కన్వీనర్ గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్ గా మహేశ్వర్ రెడ్డి ని నియమించారు.