
ఆదివారం(మే 4) ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వసం సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక పరాజయం ఖామనుకుంటున్న దశలో 13 ఓవర్లో విశ్వరూపమే చూపాడు. మొయిన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 13 ఓవర్లో తొలి బంతికి హెట్ మేయర్ సింగిల్ తీయగా.. ఆ తర్వాత పరాగ్ మిగిలిన 5 బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్ విన్నింగ్ రేస్ లోకి వచ్చింది.
Also Read : టీమిండియాకు షాక్ ఇచ్చిన శ్రీలంక
207 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాజస్థాన్ గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాలి. క్రీజ్ లో రియాన్ పరాగ్(86) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. రస్సెల్ (25 బంతుల్లో 57: 4 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోయాడు. అతనితో పాటు రఘువంశీ(44), గర్భాజ్(35), రహానే(30) రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సెల్ (57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో యుద్ వీర్ సింగ్, తీక్షణ, పరాగ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.
5 CONSECUTIVE SIXES BY RIYAN PARAG VS MOEEN ALI. 🤯 pic.twitter.com/fgpW2IgUEm
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2025