60 ఏళ్ల క్రితం రూ.7వేల విలువైన రోలెక్స్ వాచీ.. రూ, 41 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది

60 ఏళ్ల క్రితం రూ.7వేల విలువైన రోలెక్స్ వాచీ.. రూ, 41 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది

1964లో రూ. 7వేలకి కొనుగోలు చేసిన రోలెక్స్ వాచ్.. ఇప్పుడు  UKలో వేలంలో రూ. 41లక్షలకు పైగా అమ్ముడుపోయింది. రాయ‌ల్ నేవీలో ప‌నిచేస్తున్న ఓ డ్రైవ‌ర్ అప్ప‌ట్లో ఈ వాచీని కొన్నారు. ఆయ‌న కుమారుడు ఇప్పుడు ఆ వాచీని వేలం వేశారు. దాదాపు 60ఏళ్ల కింద కొన్న ఈ గడియారం రోలెక్స్ స‌బ్‌మారిన‌ర్ మోడ‌ల్‌కు చెందింది. ఈ వాచీని ద డ్రైవ‌ర్స్ వాచీ అని కూడా పిలుస్తారు. దీన్ని 1953లో లాంచ్ చేశారు. ఇది వాట‌ర్‌ప్రూఫ్ కూడా.

రాయ‌ల్ నేవీలోని రెస్క్యూ హెలికాప్ట‌ర్ల‌లో ప‌నిచేసే సైమ‌న్ బార్నెట్ అనే ఓ డ్రైవ‌ర్ దీన్ని కొన్నారు. ఆయ‌న 2019లో మ‌ర‌ణించారు. ఇప్పుడు ఆయ‌న కుమారుడు పీట్ బార్నెట్ ఈ వాచీని న సొంత పట్టణం నార్‌ఫోక్‌లోని డిస్స్‌లో వేలంలో అమ్మారు. నేవీలో ప‌నిచేసిన త‌న తండ్రి డైవింగ్ స‌మ‌యంలో ఈ వాచీని వాడిన‌ట్లు ఆయన స్పష్టం చేశారు.

రెస్క్యూ హెలికాప్ట‌ర్ల‌లో పనిచేసే సమయంలో సైమ‌న్ బార్నెట్ కు ఈ రోలెక్స్ వాచ్ చాలా ఉపయోగపడేది. అతను ఎక్కువ భాగం నీటిలోనే ఉండాల్సి రావడంతో.. అతను నీటి కింద ఎంతసేపు ఉన్నాడో తెలుసుకోవడానికి ఇదే చక్కని సాధనంగా ఉపయోగపడేది. ఆ రోజుల్లో రోలెక్స్ వాచీని కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా.. సబ్‌మెరైనర్ పరికరంగానూ సహాయపడిందన్నమాట. తన తండ్రి చనిపోయాక ఈ వాచీని తాను అన్ని సందర్భాల్లోనూ ధరించేవాడినని, కానీ 60వేల పౌండ్ల (రూ.61లక్షలకు పైగా) విలువ గల సాధనం తన మణికట్టు దగ్గర పెట్టుకుని ఉండలేకపోయానని ఈ సందర్భంగా సైమన్ కుమారుడు పీట్ తెలిపారు.